12-02-2024

బీచ్‌లో బీభత్సం మరోసారి అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి

TV9 Telugu

బుల్లి తెర పై తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శ్రీముఖి. ఈ చిన్నదానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది ఈ చిన్నది.

ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గానూ నటించింది. ఆ సినిమా హిట్ కాకపోవడంతో శ్రీముఖికి పెద్దగా గుర్తింపు రాలేదు.

సినిమాల్లోకి రాక ముందు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు యాంకర్ గా చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ బబ్లీ బ్యూటీ.

జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆతర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

తెలుగులోనే కాకుండా తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడ ఇండస్ట్రీలో చంద్రిక అనే సినిమాల్లో నటించింది శ్రీముఖి.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

తన మాటలతోనే కాదు అందంతోనూ ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటుంది ఈ చిన్నది. నెట్టింట ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా మరోసారి తన గ్లామర్ తో కట్టిపడేసింది శ్రీముఖి. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో శ్రీముఖి చాలా అందంగా కనిపించింది.