శ్రీముఖి వయసు అడిగిన నెటిజన్.. స్టార్ యాంకర్ ఏం చెప్పిందో తెలుసా?

TV9 Telugu

11 July 2024

సినిమాలు, టీవీషోస్‌ తో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది స్టార్ యాంకర్ శ్రీముఖి.

ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేససే బుల్లితెర రాములమ్మ అప్పుడప్పుడూ తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. 

అలా తాజాగా శ్రీముఖి మరోసారి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. నెటిజన్ల ప్రశ్నలకు తన దైన శైలిలో ఆన్సర్స్ ఇచ్చింది.

న్ను బాగా ఇరిటేట్ చేసే ఫ్రెండ్, కేరింగ్‌గా చూసుకునే ఫ్రెండ్స్ ఎవరు? అని అడిగితే.. ఆర్జే చైతూ, అవినాష్ పేర్లను శ్రీముఖి చెప్పింది.

ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అన్న ప్రశ్నకు లక్ష్మి సినిమాలో ఫన్నీ ఎక్స్ ప్రెషన్  'అంటే..అది.. అరె రామ్' లా మీమ్ షేర్ చేసింది.

అలాగే మరో నెటిజన్ వయసు గురించి అడిగాడు. దానికి ఏ మాత్రం ఆలోచించకుండా 31 అని సమాధానమిచ్చింది శ్రీముఖి.

 కాగా  బుల్లితెరపై పలు టీవీషోలతో దుమ్ములేపేస్తోన్న శ్రీముఖి అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా బాగానే మెరుస్తోంది.

అయితే బుల్లితెరపై సక్సెస్ అయినట్లు వెండితెరపై పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయిందీ బుల్లితెర రాములమ్మ.