నక్క తోక తొక్కిన శ్రీముఖి.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్

TV9 Telugu

07 April 2024

ఓవైపు టీవీషోలు, పండగ ఈవెంట్లు చేస్తూనే మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంటుంది శ్రీముఖి.

ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో తళుక్కున మెరిసిందీ బుల్లితెర రాములమ్మ.

ప్రస్తుతం బుల్లితెరపై బిజీబిజీగా గడిపేస్తోన్న శ్రీముఖికి ఒక బంపరాఫర్ వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

అదేంటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ లో వస్తోన్న పాన్ ఇండియా సినిమాలో శ్రీముఖికి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీలో స్టైలిష్ స్టార్ కు చెల్లెలిగా  మన రాములమ్మ నటించనుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అట్లీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాగా ఇదివరకు త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా జులాయి శ్రీముఖి నటించిన సంగతి తెలిసిందే.

 ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం శ్రీముఖికి దక్కినట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.