బులితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. చలాకీతనం.. వాక్చాతుర్యంతో యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఈ తెలంగాణామ్మాయి.
తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసింది శ్రీముఖి.
చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తన తల్లితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అమ్మ ప్రయాణం నాలో ఎంతో స్పూర్తి నింపింది అంటూ తన తల్లి గురించి చెప్పుకొచ్చింది.
ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఆమె ప్రయాణం నాలో ఎంతో స్పూర్తి నింపింది. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి తనే కారణం.
చిన్న వయసులోనే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తనకున్న అభిరుచితో బ్యూటీషియన్‌గా మారి ఎంతో మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చింది.
మాకోసం ఎన్నో త్యాగాలు చేసింది. చిటీనేజ్‌లో ఉన్నప్పుడు నేను చాలా బొద్దుగా ఉండేదాన్ని. ఆ సమయంలో బాడీషేమింగ్ కామెంట్స్.. అవమానాలు ఎదుర్కొన్నాను.
అలాంటి సమయంలో ఆమె ధైర్యం చెప్పింది. ప్రతిక్షణం నన్ను ప్రోత్సహించి.. ప్రేమించి ఆత్మస్థైర్యంతో నలిబడేలా చేసింది. త్వరలో ఆమె 50వ వసంతంలోకి అడుగుపెడుతుంది.
ఇప్పటికీ నాలో స్పూర్తి నింపుతూనే ఉంది. జీవితాంతం నీకు రుణపడి ఉంటా అమ్మా.. అంటూ తన తల్లిపై ప్రేమను గొప్పగా చెప్పింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరలవుతుంది.