మరోసారి ఆ హీరోతో రొమాన్స్ కు రెడీ అయిన శ్రీలీలరతికా రోజ్

Rajeev 

30 May 2024

 ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా శ్రీలీల ను స్టార్ హీరోయిన్ రేంజ్ కు తీసుకెళ్లింది. పెళ్ళిసందడి సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. 

ఆతర్వాత రవితేజ ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే ఈ అమ్మడి దశ తిరిగిపోయింది. 

వరుసగా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది శ్రీలీల. 

చిన్న హీరోల దగ్గర నుంచి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల వరకు అందరి సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతుంది. 

అయితే ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. 

అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ఓకే చేసిందట. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది. 

తనకు హిట్ ఇచ్చిన మాస్ రాజా రవితేజతో ఓ సినిమా చేస్తుందట శ్రీలీల. దాంతో మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది లీల.