సీనియర్ హీరో పక్కన శ్రీలీల.. నిజంగానే క్రేజీ ఛాన్స్.. కానీ..
Rajitha Chanti
Pic credit - Instagram
కొన్నాళ్లుగా శ్రీలీల సైలెంట్ అయ్యింది. ఒకప్పుడు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మను ఇప్పుడు దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదనిపిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారం సినిమాతో థియేటర్లలో సందడి చేసింది.. కానీ ఈ మూవీలో శ్రీలీల పాత్రకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదంటూ విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ మినహా శ్రీలీల చేతిలో మరో ప్రాజెక్ట్ లేదంటూ టాక్ వినిపిస్తుంది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు తమిళంలో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించనున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తుందని సమాచారం.
అయితే ఈ సినిమాలో శ్రీలీల అజిత్ పక్కన హీరోయిన్గా నటిస్తోందా ?.. లేదా మరేదైనా ముఖ్య పాత్రలో కనిపించనుందా అనే విషయం పై మాత్రం క్లారిటీ రాలేదు.
అయితే అజిత్, శ్రీలీల కాంబో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అజిత్ పక్కన కూతురిగా కనిపిస్తుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యింది శ్రీలీల. కెరీర్ మొదట్లో స్టోరీ గురించి ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ఓకే చేసింది శ్రీలీల.
దీంతో అమ్మడి ఖాతాలో వరుసగా డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో శ్రీలీల క్రేజ్ కూడా తగ్గిపోయింది. కేవలం డాన్స్ కోసం మాత్రమే తీసుకుంటున్నారని కామెంట్స్ వచ్చాయి.