స్పీడ్ తగ్గించిన శ్రీలీల.. కారణం అదే అయ్యుంటుందా..!

Rajeev 

01 August 2024

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి ప్రేక్షకులను అలరించారు. వారిలో శ్రీలీల కూడా ఉంది. 

పెళ్ళిసందడి సినిమాతో పరిచయమైన ఈ భామ తెలుగులో వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. 

తక్కువ సమయంలోనే శ్రీలీల.. కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ధమాకా సినిమాతో శ్రీలీల హిట్ అందుకుంది. 

ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దారుణంగా నిరాశపరిచాయి. దాదాపు యంగ్ హీరోలందరితో జతకట్టింది ఈ బ్యూటీ.

ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది.

ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు నితిన్ తో ఓ సినిమా చేస్తోంది. 

వరుసగా ఫ్లాప్స్ పలకరించే సరికి శ్రీలీల స్పీడ్ తగ్గించింది. ఇప్పుడు ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటోంది.