25 April 2024
స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అయిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోతో కలిసి..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ థియేటర్లలో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఈ బ్యూటీ అలరించినా అందులో కొన్ని ప్లాప్ కాగా.. మరికొన్ని మాత్రమే అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది శ్రీలీల.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు సినిమాలు తప్ప మరే ప్రాజెక్ట్ లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.
తమిళంలో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా గోట్. ఇందులో దళపతి విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది.
ఇందులో మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల కూడా భాగం కాబోతుందని నెట్టింట టాక్ వినిపిస్తుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం గోట్ చిత్రంలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనుందట. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఇందులో శ్రీలీల స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయని.. అలాగే ఈ మూవీలో శ్రీలీల, విజయ్ కాంబోలో స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.