'ఇకపై సినిమాల్లోఅలాంటివి చేయను'.. శ్రీలీల సంచలన నిర్ణయం

08 December 2024

Basha Shek

పెళ్ళి సందD’ తో తళుక్కున మెరిసింది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఇందులో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

ఇక మాస్ మహరాజా రవితేజతో కలిసి ధమాకాలో నటించిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాట్టింది.

అయితే ఆ తర్వాత శ్రీలీల నటించిన సినిమాలు నిరాశపర్చాయి. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

అయితే ప్లాఫ్ అయిన సినిమాల్లోనూ శ్రీలీలకు మంచి పేరొచ్చింది. అందుకు కారణం ఆమె ఎనర్జిటిక్ డ్యాన్స్ అండ్ గ్రేస్.

ఈ కారణంగానే అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్  పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో అవకాశం దక్కించుకుంది శ్రీలీల.

ఇందులో ఆమె నటించిన కిస్సిక్ సాంగ్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. అభిమానుల చేత ఈలలు వేయిస్తోంది.

అయితే దీని తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చిందట శ్రీలీలకు. అయితే వెంటనే రిజెక్ట్ చేసిందట.

అంతేకాదు ఇప్పట్లో మరే  సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేయనని కరాఖండిగా చెప్పేసిందట డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.