17 January 2024
ఆ హీరోయిన్స్ జాబితాలోకి శ్రీలీల .. బ్యూటీ చేస్తోన్న తప్పేంటీ ?.
TV9 Telugu
Pic credit - Instagram
పెళ్లి సందడి ఇండస్ట్రీలోకి ఎంటరై ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీలీలీ. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఒకే ఏడాదిలో అరడజనుకు పైగా చిత్రాలను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. యంగ్ హీరోలు మాత్రమే కాదు.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది.
అయితే అక్కడే శ్రీలీల పొరపాటు చేసింది. హీరో, బ్యానర్ పేర్లను చూసి సినిమాలకు సైన్ చేసింది. ఫలితంగా ఇప్పుడు వరుస ప్లాపులతో డేంజర్ జోన్లోకి వెళ్లింది.
ఇటీవల శ్రీలీల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. స్కంధ, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.
ఆ తర్వాత బాలకృష్ణతో నటించిన భగవంత్ కేసర్ హిట్ టాక్ అందుకుంది. ప్లాపులు వచ్చినా అవేమి పట్టించుకోకుండా తన మూవీస్ పై దృష్టి పెట్టింది శ్రీలీల.
ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇందులో మరోసారి తన డాన్స్, అందంతో అలరించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ సినిమాలో శ్రీలీల పాత్రపై విమర్శలు వచ్చాయి. కేవలం డాన్స్ మాత్రమే తప్పు.. తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ కామెంట్స్ వచ్చాయి.
దీంతో అటు పూజా హెగ్డే, కృతిశెట్టి లాంటి హీరోయిన్స్ చేసిన తప్పులే ఈ బ్యూటీ చేస్తుందని.. నటనను ప్రదర్శించే పాత్రలను ఎంచుకోవడం లేదని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.