‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ. ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.
ఆ తర్వాత స్కంద, ఆది కేశవ, ఎక్స్ ట్రార్డినరి మ్యాన్, గుంటూరు కారం.. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ.
అయితే ఇందులో విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో కాస్త స్పీడ్ తగ్గించిన శ్రీలీల ఆచితూచి సినిమాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే శ్రీ లీల మంచి డ్యాన్సర్. గుంటూరు కారంలో ఆమె డ్యాన్స్ ను చూసి లేడీ ప్రభుదేవా అని కితాబు కూడా ఇచ్చారు మహేశ్ బాబు.
ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలని శ్రీలీలకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం
శ్రీలీలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఐటం సాంగ్స్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారట.
అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ టైం లో కోట్లు ఇచ్చినా సరే స్పెషల్ సాంగ్స్ చేయనని కరాఖండిగా చెప్పేసిందట శ్రీలీల.