శ్రీలీలకు ఐ లవ్యూ చెప్పిన నెటిజన్.. అమ్మడి రియాక్షన్ ఏంటో తెలుసా?
19 September 2024
Basha Shek
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల.
ఫస్ట్ సినిమాలోనే ఈ అమ్మాయి అందం, అభినయానికి అందరూ ముగ్ధులైపోయారు. దీంతో వరుసగా అవకాశాలొచ్చాయి.
అలా వచ్చిన అవకాశాలన్నింటినీ అందుకుంటూ దూసుకుపోయిన ఈ అమ్మడుకు హిట్స్ కంటే ఎక్కువ ఫ్లాప్‌లే ఎదురయ్యాయి.
దీంతో సినిమా షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
సమయం దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల వేదికగా తన ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుందీ అందాల తార.
తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో ఆస్క్ మి ఎ క్వష్చన్ అంటూ నెటిజన్లతో చాట్ చేసింది. అందులో భాగంగా చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు
అందులో ఓ నెటిజన్ ఐ లవ్ యూ అని కామెంట్ పట్టాడు. దానికి శ్రీ లీల ‘ఉమ్ ఆ.. ఉమ్ ఆ.. ఐ లవ్ యూ’ అని రిప్లై ఇచ్చింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది శ్రీలీల. అలాగే నితిన్, రవితేజ మూవీస్ లలో కనిపించనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..