ప్రజెంట్ టాలీవుడ్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ శ్రీలీల. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్‌కు జోడిగా ప్రమోట్ అయిన ఈ బ్యూటీ గ్లామర్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు.
అయితే కమర్షియల్ ట్రెండ్‌లో కంటిన్యూ అవుతున్నా.. ఆ ఒక్క పని మాత్రం చేయని క్లారిటీ ఇచ్చేశారు శ్రీలీల. ఏంటా పని అనుకుంటున్నారా..?
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాలోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ..
రెండో సినిమా ధమాకాతో ఏకంగా 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. మాస్ డ్యాన్స్‌తో ఆడియన్స్‌ను మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలను కూడా ఫిదా చేశారు.
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గుంటూరు కారం యూనిట్‌లోకి సెకండ్ హీరోయిన్‌గా ఎంటర్ అయిన శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్‌గా ప్రమోట్ అయ్యారు.
మరో అరడజను సినిమాలు అమ్మడి కిట్టీలో ఉన్నాయి. వరుసగా కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తెర మీద లిప్ లాక్ మాత్రం చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు.
ఈ నిర్ణయం శ్రీలీల కెరీర్‌ను ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకప్పుడు నార్త్ సినిమాల్లోనే కనిపించిన లిప్ లాక్స్ ఇప్పుడు సౌత్ మూవీస్‌లోనూ కామన్ అయిపోయాయి.
ఈ టైమ్‌లో లిప్ లాక్‌కు నో అంటే ఆఫర్స్ వస్తాయా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇలాంటి కండిషన్స్ పెడుతూనే స్టార్ లీగ్‌లో కంటిన్యూ అవుతున్నారు సాయి పల్లవి.
ఇప్పుడు శ్రీలీల కూడా అదే బాటలో నడుస్తాననటం సౌత్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.