శ్రీలీల గురించి తెలుగు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్లింది ముద్దుగుమ్మ.
ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన ఆఫర్స్ సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
మొదటి సినిమాతోనే మంచి హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మాస్ మహారాజ్ "ధమాకా" టాలీవుడ్ నిజమైన ధమాకా అనిపించుకుంది.
అక్కడ నుంచి ఒక టైం లో అయితే టాలీవుడ్ లోనే మోస్ట్ యంగ్ హీరోయిన్ కం అత్యధిక సినిమాలు కూడా చేతిలో ఉన్న ఇండియన్ హీరోయిన్ గా కూడా రికార్డు సెట్ చేసింది.
ఇది ఇలా ఉంటే శ్రీలీల నార్త్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బల్వీందర్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిట్టీ సినిమాలో సిద్దార్థ్‌కు జోడీగా నటిస్తున్నారు శ్రీలీల.
యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని టాక్.
అలానే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ సినిమా ‘దిలేర్’లోనూ శ్రీలీల కథానాయిక అని సమాచారం. ఈ రెండు సినిమాలూ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.