TV9 Telugu
శ్రీలీల న్యూ ఫోటోషూట్.. కమల్ మూవీ కాంట్రవర్సీ..
25 Febraury 2024
గుంటూరు కారం తర్వాత పూర్తిగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల.
ప్రస్తుతం ఈమె తన చదువుపై ఫోకస్ చేస్తుంది. దాంతో పాటు ఫ్యాన్స్ కోసం ఫోటోషూట్స్ కూడా చేస్తుంది ఈ వయ్యారి.
తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతుంది. అందులో చాలా పద్దతిగా కనిపిస్తుంది యంగ్ హీరోయిన్ శ్రీలీల.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సినిమాలున్నాయి.
వివాదాలు కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్‌కు కొత్త కాదు. ఇప్పుడు ఎదో ఒక విషయంలో ఇదే జరుగుతుంది.
తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఆయన నిర్మిస్తున్న అమరన్ సినిమా ఇప్పుడు కాంట్రవర్సీకి కారణమవుతుంది.
కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి 2014లో వీర మరణం పొందిన భారతీయ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది.
టీజర్‌లో కంటెంట్ చూసిన మైనారిటీ వర్గాలు కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి