ఇంత అందం భువిపై తిరుగుతుంటే ఆ స్వర్గం చిన్నబోదా..
18 November 2023
జూన్ 14, 2001న యునైటెడ్ స్టేట్స్ లోని మిచిగాన్ లో డెట్రాయిట్ లో తెలుగు కుటుంబంలో జన్మించింది శ్రీలీల.
పుట్టింది యూస్ లో అయినప్పటికీ బెంగళూరులో పెరిగింది. ఈ వయ్యారి తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ గా చేస్తున్నారు.
స్వర్ణలత పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావుతో విడాకులు తీసుకున్న తర్వాత శ్రీలీల ఆమెకు జన్మించింది.
చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. డాక్టర్ కావాలని కోరికతో 2021 నాటికి MBBS పూర్తీ చేసింది ఈ వయ్యారి.
ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ తన డాక్టర్ చదువును కొనసాగిస్తోంది ఈ అందాల తార.
2019లో కిస్ అనే ఓ కన్నడ చిత్రంలో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది. తర్వాత భరతే అనే కన్నడ సినిమా చేసింది.
2021లో పెళ్ళిసందడి అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం అదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కరం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి