అందంలో అప్సరసలకే పోటీ ఇస్తున్న శ్రీలీల..

30 October 2023

14 జూన్ 2001న యునైటెడ్ స్టేట్స్‌లో తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల భామ శ్రీ లీల. బెంగుళూరులో పెరిగింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావు, స్వర్ణలత దంపతుల విడిపోయిన తర్వాత జన్మించింది ఈ వయ్యారి భామ.

చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ ప్రారంభించింది. 2021 నాటికి ఆమె MBBS చివరి సంవత్సరం పూర్తిచేసింది.

2019లో కిస్ అనే కన్నడ చిత్రంలో సినీ అరంగేట్రం చేసింది. తర్వాత భరతే అనే మరో కన్నడ మూవీలో నటించింది ఈ బ్యూటీ.

2021లో శ్రీకాంత్ తనయుడు రోషన్ కి జోడిగా పెళ్లిసందడి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2022లో రవితేజ సరసన ధమాకా చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం హిట్ తో ఈ బీయూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద చిత్రంలో రామ్ కి జోడిగా నటించింది ఈ బ్యూటీ. ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేదు.

దసరా కనుకగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య కూతురు పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.