16 November 2023
కెరీర్లో ప్రతి అమ్మాయికీ బ్యాకప్ ఉండాలంటోన్న హీరోయిన్ శ్రీలీల..
Pic credit - Instagram
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా దూసుకెళ్తున్నారు శ్రీలీల. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె.
ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది హీరోయిన్ శ్రీలీల.
ఇటీవలే స్కంద, భవగంత్ కేసరి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆదికేశవ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పుడు శ్రీలీల ఆదికేశవ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో తన ఎంబీబీఎస్ చదవడం గురించి మాట్లాడింది.
డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని.. తప్పకుండా డాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చానంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రీలీల.
అటు నటిగా ఉంటూనే ఇటు ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నానని.. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందటాన్ని అదృష్టంగా భావిస్తుందట.
తన తొలి ప్రాధాన్యం మాత్రం డాక్టర్ కావడమే అని.. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా అలాంటి బ్యాకప్ ఉండాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
నటిగా అభినయంతో లేదంటే వైద్యురాలిగా చికిత్స అందించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది శ్రీలీల.
ఇక్కడ క్లిక్ చేయండి.