09 January 2024
బంగారు విగ్రహానికి ప్రాణం పోసినట్టు ఉంటారు మహేష్.. శ్రీలీల కామెంట్స్
TV9 Telugu
Pic credit - Instagram
గుంటూరులో ఈరోజు సాయంత్రం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది.
వేడుకకు వచ్చిన జనాలను చూస్తే తనకు ఇప్పుడు అర్థమవుతందని.. గుంటూరు వస్తే హీరోగారు తనను ఎందుకు గుర్తుపెట్టుకుమన్నారో అని తెలిపింది.
ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిందని త్రివిక్రమ్ కు థాంక్స్ చెప్పుకొచ్చింది. అలాగే సెట్లో తన అల్లరి భరించినందుకు కూడా థాంక్స్ చెప్పుకొచ్చింది.
ఎన్నో పుస్తకాలు చదవి ఆ జ్ఞానాన్ని ఒక పాటలోనో, మాటలోనో, సినిమా ద్వారానో తీసుకొస్తారి.. అలాంటి వాటిలో తమను భాగం చేస్తున్నందుకు థాంక్స్ తెలిపింది.
మహేష్ బాబును చూస్తుంటేనే మాటలం రావడం లేదని ఈ విషయం ఆయనకు కూడా అర్థమవుతుందని.. సెట్ లో చాలాసార్లు డైలాగ్స్ మార్చిపోయినని తెలిపింది.
ఆయనతో షూట్లో పాల్గొన్న మొదటి రోజు ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన ఎలా ఉంటారు.. ఎలా బిహేవ్ చేస్తారని ఇంట్లో వాళ్లదంరూ అడిగారని చెప్పుకొచ్చింది.
ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్ బాబు అలాగే ఉంటారని ఇంట్లో వాళ్లతో చెప్పానని.. ఆయన మనసు కూడా బంగారమని తెలిపింది.
కెమెరామెన్ పరమహంస రెండు రోజులు చేయాల్సిన షుటింగ్ ఒక పూటలా పూర్తిచేసారని ఒక రోజంతా వేస్ట్ అయిందని తిట్టుకుంటూ ఉండేదాన్ని అన్నారు శ్రీలీల.
ఇక్కడ క్లిక్ చేయండి.