28 August 2024
ఎట్టకేలకు కొత్త సినిమాకు ఓకే.. శివకార్తికేయన్ సరసన శ్రీలీల..
Rajitha Chanti
Pic credit - Instagram
కొన్నాళ్లుగా హీరోయిన్ శ్రీలీల సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. చివరగా గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో మరో సినిమాతో అలరించలేదు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది.
ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు శ్రీలీల. ప్రస్తుతం ఆమె తన చదువులపై దృష్టి పెట్టినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
అయితే తాజాగా ఈ బ్యూటీ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా తెలుగులో మాత్రం కాదని టాక్.
ఇన్నాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అలరించిన శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్ షిప్ట్ అవుతుందట. తమిళంలో ఈ అమ్మడుకు ఆఫర్స్ వస్తున్నాయట.
గురు, ఆకాశం నీ హద్దు రా వంటి చిత్రాలతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుధ కొంగర కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న కొత్త ప్రాజెక్టులో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించనున్నారని టాక్.
ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ఫోటోషూట్ కూడా జరిగిందని.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి.