07 October 2025
బాలీవుడ్లో వరుస ఆఫర్స్.. బ్లాక్ బస్టర్ హీరోకు జోడీగా శ్రీలీల..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసి ధమాకాతో హిట్టు అందుకుంది.
దీంతో ఈ బ్యూటీకి ఒక్కసారిగా ఆఫర్స్ వచ్చాయి. వెంట వెంటనే స్టార్ హీరోలతోపాటు ఇటు యంగ్ హీరోలకు జోడిగా నటించింది.
ఇప్పుడు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్ముడు.. కార్తీక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తుంది.
ఆశికీ 3 అనే సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండంగా.. మరో ఛాన్స్ కొట్టేసిందట.
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ప్రాజెక్ట్ కు ఓకే చేసిందనే టాక్ నడుస్తుంది. అలాగే మరిన్ని సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.
ఇటీవలే నేషనల్ అవార్డ్ అందుకున్న 12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సేకి జోడిగా శ్రీలీల నటించనుందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.
2008లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ దోస్తానా చిత్రానికి కొనసాగింపుగా దోస్తానా 2 చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్రయత్నాలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ముందుగా జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్ హీరోహీరోయిన్లుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు విక్రాంత్ మాస్సే, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్