12 May 2025
బాలీవుడ్లో మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఈసారి హీరో ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. వరుస సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. రవితేజ సరసన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజ్ పెంచుకుంది.
దీంతో తెలుగులో ఒకేసారి అరడజనుకుపైగా సినిమాలు ప్రకటించింది. కానీ వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఖాతాలో ప్లాప్స్ సైతం పడ్డాయి
ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయం అచితూచి జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది శ్రీలీల. తాజాగా మరో హిందీ ప్రాజెక్టుకు ఏకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
విక్రాంత్ మాస్సే, లక్ష్య ప్రధాన పాత్రలలో దోస్తానా 2 సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆఫర్ శ్రీలీలను వరించినట్లుగా టాక్.
ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ దోస్తానా 2 సినిమా కోసం శ్రీలీలను కథనాయికగా ఎంపిక చేశారని.. ప్రస్తుతం ఆమెతో చర్చలు చేస్తున్నారని టాక్.
త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ప్రస్తుతం మాస్ జాతర, పరాశక్తి వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్