ఆ హ్యాండ్సమ్ హీరోకు ఫస్ట్ లిప్ లాక్ ఇచ్చేసిన శ్రీలీల!

16 February 2025

Basha Shek

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల. ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టింది.

ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అదే సమయంలో కొన్ని ఫ్లాపులు ఎదుర్కొంది

అయితే ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాలో కిస్సిక్‌ సాంగ్‌తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది శ్రీలీల.

దీంతో మళ్లీ ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో శ్రీలీల నటిస్తోంది.

తాజాగా బాలీవుడ్‌లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసిందీ అందాల తార. తాజాగా తన బాలీవుడ్ డెబ్యూ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది.

ఈ సినిమాలో కార్తీక్ ఆ‍ర్యన్ సరసన కనిపించనుంది శ్రీలీల. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ వీడియోలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ రొమాన్స్‌తో రెచ్చిపోయారు.ప్రేమలో ఇంటెన్సిటీని  చూపిస్తోన్నట్టుగా టీజర్‌గా ఉంది.

కాగా ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌కు శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి రొమాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది