ఇకపై అలా అయితేనే కొత్త సినిమాలకు సై అంటోన్న శ్రీలీల..
Rajitha Chanti
Pic credit - Instagram
రెండు సినిమాలతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారింది శ్రీలీల. ఒక్క ఏడాదిలోనే దాదాపు అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే ఆమె సైన్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. కేవలం ఒకట్రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిగిలిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో మరోసారి హిట్ అందుకుంది. కానీ ఇందులో ఈ బ్యూటీ పాత్ర ప్రాధాన్యత కంటే కంటే ఎక్కువగా కేవలం డాన్స్‌తో ఇరగదీసింది.
ఇక ఈ మూవీ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు శ్రీలీల. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది. అయితే పరీక్షల కోసం బ్రేక్ తీసుకుంది.
ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కారణంగానే ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో కేవలం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది.
అయితే శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ తొందరపడి సినిమాలకు సైన్ చేయాలనుకోవడం లేదట. గతేడాది వచ్చిన ఆదికేశవ, స్కంద సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.
దీంతో ఈ బ్యూటీ సినిమా కంటెంట్ ప్రాధాన్యత.. తన రోల్ ఇంపార్టెన్స్ చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటుందట. ఇదే విషయాన్ని నెట్టింట అభిమానులు కూడా కామెంట్స్ చేశారు.
పరీక్షల కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ ఇకపై బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేయకుండా.. కాస్త ఆలోచించి కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకోవాలనుకుంటుందట.