23 June 2025

8 సినిమాలు చేస్తే రెండే సూపర్ హిట్స్.. క్రేజ్ మాత్రం తగ్గేదేలే..

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో చాలా మంది యంగ్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. ఈ హీరోయిన్ మాత్రం ఇప్పటివరకు 8 సినిమాల్లో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది.

మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే అందులో కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. 

అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. హిట్స్ రాకపోయినా తెలుగులో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది ఈ భామ.

ఆమె మరెవరో కాదండి.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఇప్పుడు యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ వరకు అందరి సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది. 

శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ భామ. 

దీంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గలేదు. 

చివరిసారిగా రాబిన్ హుడ్ సినిమాలో కనిపించింది. ఈ మూవీ సైతం ఆకట్టుకోలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుంది. 

అలాగే అఖిల్ సరసన లెనిన్ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా రవితేజ జోడిగా మరోసారి మాస్ జాతర అనే చిత్రంలోనూ నటిస్తుంది ఈ క్యూటీ.