డ్యాన్సులు కాదు... ఫైట్లు కష్టం: శ్రీలీల.. ట్వల్త్ ఫెయిల్ హీరో కొత్త సినిమా..
TV9 Telugu
08 April 2024
తాను చేసే డ్యాన్సులకన్నా, సెట్లో హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా కష్టమని అన్నారు యంగ్ హీరోయిన్ శ్రీలీల.
హీరోలు అందురు సినిమా షూటింగ్ సమయంలో ఫైట్స్ కోసం కష్టపడే తీరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు హ్యాపెనింగ్ బ్యూటీ.
చిన్నప్పటి నుంచీ తనకు డ్యాన్స్ అంటే చాల ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు టాలీవుడ్ స్టార్ కథానాయకి శ్రీలీల.
డ్యాన్సులను... వాటిని ప్రదర్శించడం వల్ల పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పారు శ్రీలీల.
బాలీవుడ్ బయోగ్రాఫికల్ డ్రామా ట్వల్త్ ఫెయిల్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో విక్రాంత్ మాస్సే.
ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా 'ఆంఖోన్ కి గుస్తాఖియాన్'. ఈ చిత్రంలో ఆయన కళ్లు కనిపించని సంగీతకారుడిగా నటిస్తున్నారు.
నమ్మకం, సంకల్పం, కోరిక లాంటి భావోద్వేగాలు ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఈ మూవీ దర్శకనిర్మాతలు.
వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు 'ఆంఖోన్ కి గుస్తాఖియాన్' హీరో విక్రాంత్ మాస్సే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి