28 May 2024

ఆ స్టార్ హీరో సరసన శ్రీలీల.. మళ్లీ బ్లాక్ బస్టర్ వచ్చినట్టే..

Rajitha Chanti

Pic credit - Instagram

గతేడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో తెగ సందడి చేసింది హీరోయిన్ శ్రీలీల. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. 

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీలీల.. ఇప్పుడు కంటెంట్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. 

చివరగా మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎంబీబీఎస్ కోసం బ్రేక్ తీసుకున్నట్లు టాక్.

ఇన్నాళ్లు సైలెంట్ అయిన శ్రీలీల.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది కూడా తన కెరీర్‏లో హిట్టు ఇచ్చిన హీరో మూవీ. 

మాస్ మాహారాజా రవితేజ 75వ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. కొత్త  డైరెక్టర్ భాన భోగవరపు దర్శకత్వంలో రవితేజ సినిమా రాబోతుంది.

ఇందులో రవితేజ సరసన శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రయూనిట్ ఆమెతో సంప్రదింపులు జరపగా ఓకే చెప్పిందని టాక్. 

దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అటు సాంగ్స్ సైతం హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ జోడి రిపీట్ కాబోతుంది.