TV9 Telugu
శ్రీ విష్ణు హీరోగా వరుస సినిమాలు ప్రకటన.. ‘వళరి’ ట్రైలర్..
03 March 2024
2023లో సామజవరగమన చిత్రంతో విజయాన్ని అందుకున్నారు శ్రీ విష్ణు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తున్నారు.
ఇటీవల యూవీ క్రియేషన్స్ సంస్థలో ఓం బీమ్ బుష్ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రం టీజర్ కూడా విడుదలైంది.
దీని తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వాగ్ అనే చిత్రాన్ని ప్రకటించారు. దీనికి హసిత్ గోలీ దర్శకుడు.
స్వాగ్ సినిమాను అనౌన్స్ చేసిన కొంత సమయానికే మరో సినిమాను ప్రకటించారు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు.
గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ప్రకటించారు మేకర్స్. 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు దీనికి దర్శకుడు.
గీతా ఆర్ట్స్‌తో సమర్పణలో కళ్యా ఫిల్మ్స్ సంస్థలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప మరియు రియాజ్ చౌదరి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
శ్రీరామ్, రితికా సింగ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘వళరి’. మృతిక సంతోషిణి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రముఖ ఓటీటీలో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి