వార్ 2 కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ డైరెక్టర్..

TV9 Telugu

21 April 2024

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ గురించి చాలా కాలంగా బజ్ ఉంది.

ఈ చిత్రం 14 ఆగస్టు 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 471 కోట్లు రాబట్టగా  ‘వార్ 2’కి సంబంధించి వస్తున్న అప్‌డేట్‌లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది.

అలాగే ఇందులో తొలిసారి తారక్, హృతిక్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి అనే చెప్పాలి. 

ఇటీవలే వార్ 2 సెట్ లో అడుగుపెట్టారు తారక్. ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి లీకైన ఫోటోస్ వార్ పై మరింత హైప్ పెంచింది.

ఇక ఇప్పుడు మరోసారి వార్ 2 సినిమాపై బజ్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్ జాయిన్ అయ్యారని తెలుస్తోంది.

ఈ సినిమా యాక్షన్‌ని ఆయనే డిజైన్ చేస్తారని అంటున్నారు. వార్ 2 చిత్రానికి బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.