దేవరను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు కొరటాల. పేరుకు మాస్ సినిమానే అయినా.. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
దేవర కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా అయిన అలెక్స్ ALF, అర్రీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు.
హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వీటిని వాడతారు. అలాంటిది దేవర యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇది తీసుకొస్తున్నారు కొరటాల.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. వీటికోసం స్పెషల్ కెమెరాలు తీసుకొస్తున్నారు.
తాజాగా దేవర నుంచి మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. ఇది రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటించారు కొరటాల. కథ స్పాన్ భారీగా ఉండటంతో తప్పట్లేదంటున్నారు మేకర్స్.
కారెక్టర్స్ బలంగా ఉండటంతో దేన్ని తీసేయలేం అని.. అందుకే రెండు భాగాలుగా చేస్తున్నామని చెప్పారు ఈ దర్శకుడు.
జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఎప్రిల్ 5, 2024న దేవర పార్ట్ 1 విడుదల కానుంది.