ఫిల్మ్ నగర్‌ లో దేవాలయంలో ప్రత్యేక పూజలు.. దసరా నటుడు దీక్షిత్ హీరోగా కొత్త చిత్రం..

TV9 Telugu

22 January 2024

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్‌ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ విషయం ఫిల్మ్ నగర్‌ ఆలయ పాలక మండలి ఛైర్మన్‌, టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్‌ మంచు మోహన్‌బాబు తెలిపారు.

అయోధ్యలో జరగనున్న రామాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆలయ కమిటీ నుంచి కూడా పిలుపు వచ్చిందని అన్నారు మోహన్ బాబు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాను అయోధ్య రామ మందిర బాలరామ ప్రాణప్రతిష్ట ఉత్సవానికి వెళ్లడం లేదని చెప్పారు,

నాని భారీ యాక్షన్ బ్లాక్ బస్టర్ దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.

ఆ సినిమాలో హీరో నానికి ఫ్రెండ్‌గా నటించిన దీక్షిత్‌ త్వరలో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేకే దర్శకత్వం వహిస్తున్నారు. శశి ఓదెల మరో హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు, ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు మూవీ మేకర్స్.