TV9 Telugu
సన్నీ లియోన్ రెస్టారెంట్‌లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
14 Febraury 2024
బాలీవుడ్ స్టార్ నటి సన్నీలియోన్ అంటే తెలియని వారుండరు. తెలుగులో కూడా చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ.
ఇదిలా ఉంటె ఇటీవల ఆమె ఓ రెస్టారెంట్ కు యజమానిగా మారారు. దీంతో ఆమె నటిగానే కాకుండా రెస్టారెంట్ ఓనర్‌గా కూడా మారిపోయింది.
బిజినెస్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యింది. జనవరి 2024లో వందలాది అభిమానుల మధ్య యూపీలోని నోయిడాలో సన్నీ లియోన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది.
నోయిడాలోని గుల్షన్ మాల్‌లో రెస్టారెంట్ ఇలా స్టార్ట్ అయిందో లేదో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చి రుచులను ఆస్వాదిస్తున్నారు.
రెస్టారెంట్ పేరు ఏంటి అనుకుంటున్నారా? పేరు చికా లోకా. అంటే స్పానిష్ భాషలో అల్లరి అమ్మాయి అనే అర్థం వస్తుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా చికా లోకా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. చక్కగా అలంకరించిన టేబుళ్లను ప్రేమ జంటలకు అందిస్తోంది.
ప్రైవేట్ టేబుళ్లను బుక్ చేసుకునే సదుపాయం కలదు. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ లైట్ డిన్నర్ ఎంజాయ్ చేసే అవకాశం.
చీకా లోకాలో ఫిబ్రవరి 14వ తేదీన సమయం గడపడం ద్వారా మీ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి