సౌండ్ ఆఫ్ సలార్ కి భారీ వ్యూస్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చెర్రీ..
27 December 2023
TV9 Telugu
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన వసూళ్లు సాధిస్తుంది.
మొదటి రోజు సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాకు కనీసం 150 కోట్ల ఓపెనింగ్ ఎక్కడికీ పోదంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇదిలా ఉంటే తాజాగా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా నుంచి సౌండ్ ఆఫ్ సలార్ విడుదల చేసారు సంగీత దర్శకుడు రవి బస్రూర్.
దీనికి యూ ట్యూబ్‌లో అద్భుతమైన స్పందన వస్తుంది. భారీ వ్యూస్ తో ఈ bgm ప్లేయింగ్ వీడియో దూసుకుపోతుంది.
హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు వారి కూతురు క్లింకార కొణిదెలతో కలిసి ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్నారు.
ఈ మధ్యే వారి కూతురు క్లింకారాతో కలిసి చరణ్ దంపతులు ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు.
ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఉన్న రామ్ చరణ్, ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి