చెరువులో దూకి  అభిమాని ఆత్మాహుతి.. స్పందించిన సోనాలి..

TV9 Telugu

17 June 2024

ఒకప్పుడు తెలుగుతో పాటుగా ఇతర భాషల స్టార్ హీరోల సరసన నటించి కుర్రాళ్ల హృదయాలను ఏలిన నటి సోనాలి బింద్రే.

కొంతకాలంగా సినిమాల దూరంగా ఉంటూ ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన ఈ భామ ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్‌ కల్చర్‌ గురించి మాట్లాడింది.

గతంలో ఓ అభిమాని సోనాలిని చూడలేకపోయడిని చెరువులో దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు. తాజగా దీని స్పందించింది ఆమె.

ఇప్పటివరకు ఈ విషయం తనకు తెలియదని, ఆ సంఘటనను నమ్మలేకపోతున్నానంది సీనియర్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే.

అప్పట్లో తనకు వచ్చే కొన్ని మెయిల్స్‌, ఉత్తరాల్లో కొందరు రక్తంతో రాసేవారని, అవి చూసి చాలా బాధగా ఉండేదని తెలిపింది.

ప్రతి మనిషి మరో వ్యక్తి కోసం ఎందుకు ఇంతలా తాపత్రయపడతారో నాకు అర్థం కాదు. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పుని అంది.

మోడలింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టిన ఈ భామ.. 19 ఏళ్ల వయసులో ‘ఆగ్’ అనే చిత్రంతో చాలనచిత్ర అరంగేట్రం చేసింది.

కొద్ది కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్‌ హీరోయిన్ అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మళ్లీ ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ సీజన్‌ 2తో ఆకట్టుకుంది.