పుష్ప2 స్పెషల్ సాంగ్‌పై ఫిల్మ్ నగర్‌లో చర్చ..

20 September 2023

ఇన్నాళ్లూ బన్నీ అండ్‌ సుకు కలిసికట్టుగా సాగింది ప్రయాణం. కానీ ఇప్పుడు బన్నీ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. దాన్ని బ్యాలన్స్ చేసేలా సుక్కు ప్లానింగ్‌లో చేంజెస్‌ తప్పట్లేదు మరి.

కొన్నేళ్లకు ముందు రింగ రింగ రింగ రింగ అనే పదాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి నోళ్లల్లోనూ వినిపించాయి. అంతగా పాపులర్‌ అయింది ఆ పాట.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో ఇంతకు మించిన పాట ఇంకెప్పుడొస్తుందని చాలా మంది ఎదురుచూశారు. రింగ రింగను మించిన పాటే అయింది ఊ అంటావా సాంగ్‌.

అల్లు అర్జున్‌, సమంత స్టెప్పులు, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, సినిమాలో వచ్చే సందర్భం.. అన్నీ కలిసి ఊ అంటావా పాటను వైరల్‌ చేసేశాయి.

పుష్ప2లో అంతకు మించిన పాటను పెట్టాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు సుకుమార్‌. అందుకే ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో పుష్ప2 స్పెషల్ సాంగ్‌ గురించి చర్చ గట్టిగానే జరుగుతోంది.

పుష్ప2లో జిల్‌ జిల్‌మనిపించే జిగేల్‌ రాణి ఎవరని ఆరా తీస్తున్నారు జనాలు. ప్రస్తుతం తారక్‌ పక్కన దేవరలో నటిస్తున్న జాన్వీ కపూర్‌తో పుష్ప2లో స్పెషల్‌గా స్టెప్పులేయించే ఛాన్సులే ఎక్కువన్నది వైరల్‌ అవుతున్న న్యూస్‌.

ఆహా కోసం గతంలో అల్లు అర్జున్‌, శ్రీలీల కొన్ని రోజులు కలిసి పనిచేశారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌ పుష్ప2లో స్పెషల్‌ సాంగ్‌ రూపంలో కనిపిస్తుందనే ప్రచారం కూడా ఉంది.

ఆల్రెడీ శ్రీలీల మంచి డ్యాన్సర్‌ అనే పేరు తెచ్చుకున్నారు. ఇక బన్నీ పక్కన డ్యాన్స్ చేశారంటే పాట బ్లాక్‌ బస్టరే అంటున్నారు అల్లు అండ్‌ శ్రీలీల యూత్‌ అసోసియేషన్‌ మెంబర్స్.