02 November 2023
క్రికెట్ వరల్డ్ కప్ కి దారి క్లియర్.. వాయిదా పడిన సినిమాలు..
క్రికెట్, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోనే నడుస్తున్న వరల్డ్ కప్‌ను కొందరు హీరోలు ప్రమోషన్ కోసం వాడేసుకుంటున్నారు.
అయితే క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో వస్తే కలెక్షన్లపై దెబ్బ ఖాయం. అందుకే తెలివిగా కొన్ని సినిమాలు వాయిదా వేసారు.
అందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ కూడా ఉంది. దీవాళికి రావాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ అయింది.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఆదికేశవ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ముందుగా దీన్ని నవంబర్ 10న విడుదల చేయాలనుకున్నా.. ఇప్పుడు 24కి వాయిదా పడింది. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
ఈ చిత్రం ఒక్కటే కాదు.. కోట బొమ్మాలి సినిమా కూడా ముందు అనుకున్న డేట్ కాకుండా నవంబర్ 24కి వెళ్లిపోయింది.
నవంబర్ 19న వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ లోపు పెద్ద సినిమాలేవీ వచ్చే ధైర్యం చేయట్లేదు. నవంబర్ 12న టైగర్ 3 మాత్రం వచ్చేస్తుంది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. అలాగే దివాళికి తమిళ సినిమాలు జిగర్తాండ, జపాన్ విడుదల కానున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి