ట్రెండింగ్ గుంటూరు కారం  సాంగ్‌.. కమల్‌ గ్రాండ్ సెలబ్రేషన్స్‌ ..

12 November 2023

విక్రమ్ సక్సెస్‌తో బౌన్స్‌ బ్యాక్ అయిన కమల్‌ హాసన్‌ ఈ సారి బర్త్ డే వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు.

ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు తన సన్నిహితులను ఆహ్వానించి పార్టీ ఇచ్చారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌, కోలీవుడ్ హీరోలు, దర్శకులు, సీనియర్‌ నటీనటులు పాల్గొన్నారు.

స్టార్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ముఖాన్ని మార్ఫ్ చేసి క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి మంగళవారం రిలీజ్ ఫస్ట్ సింగిల్‌ ఆన్‌లైన్‌లో రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది.

క్షణాల్లోనే వైరల్‌గా మారిన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గుంటూరు కారం మూవీకి తమన్‌ సంగీతమందిస్తున్నారు.

మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల తన ఇమేజ్ మార్చుకునే పనిలో ఉన్నారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌ రోల్స్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో గ్లామరస్‌ పిక్స్ చేస్తున్నారు. గ్లామర్‌ వరల్డ్‌లో కంటిన్యూ అవ్వాలంటే అన్ని రకాలుగా కనిపించాలి, అందుకే ఆ ఫోటోస్‌ షేర్ చేశా అన్నారు అనన్య.

సిద్దార్థ్ మల్హోత్రా లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా యోధ. ఈ సినిమాను 2024 మార్చి 15న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.