కార్తికేయ కొత్త సినిమా ముచ్చట..
TV9 Telugu
14 April 2024
యువీ క్రియేషన్స్ సమర్పణలో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమాకు భజే వాయువేగం అనే పేరును ఖరారు చేశారు.
ఈ సినిమాతో కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కార్తికేయ 8వ సినిమాగా వస్తుంది.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో సూపర్‌స్టార్ మహేష్ విడుదల చేశారు.
ఫ్రెష్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తున్నామని అన్నారు భజే వాయువేగం మూవీ మేకర్స్.
త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు హీరోయిన్ మిగిలిన నటీనటులు వంటి విషయాలు కూడా అనౌన్స్ చేయనున్నట్టు తెలిపారు.
ఇటీవల కార్తికేయ హీరోగా వచ్చిన కామెడీ డ్రామా బెదురులంక 2012 విజయవంతం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.
చేసినవి తక్కువ సినిమాలైనప్పటికీ కార్తికేయకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో సినిమాపై నమ్మకంగా ఉన్నారు మేకర్స్.
హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గా మెప్పించిన నటుడు రాహుల్ భజే వాయువేగం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి