డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారతీయ ఇతిహాసం సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం సినిమా కల్కి 2898 ఏడీ.
ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. కల్కి కథ గురించి ఆల్రెడీ చూచాయగా మేకర్స్ హింట్స్ ఇస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ఈ పాన్ వరల్డ్ సినిమా కథకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
కల్కి 2998 ఏడీ మహాభారతంతో మొదలవుతుందట. క్రీస్తు శకం 2898లో పూర్తవుతుందట. అంటే, దాదాపు ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ సినిమా సాగుతుందట.
గతానికి, భవిష్యత్తుకి ముడిపడిన కథ కావడంతో దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లూ చేశారట మేకర్స్. ఆల్రెడీ హాలీవుడ్‌లో ఇలాంటి చాయలతోనే బ్లేడ్ రన్నర్ అని ఓ మూవీ ఉందట.
అయితే, దానికీ, కల్కి సినిమాకీ ఏ మాత్రం పోలిక లేకుండా ఉండేలా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.
అలా ఆ సినిమాతో పోలిక లేకుండా చేయడానికి తాము చాలా ఇబ్బందిపడాల్సి వచ్చిందని చెప్పారు నిర్మాత స్వప్నదత్.
వైజయంతీ మూవీస్ సంస్థకు బాగా కలిసొచ్చిన మే 9న కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేయాలనుకుంటోంది చిత్ర యూనిట్.