22 August 2024
ఆ సినిమాలో శోభితా ధూళిపాళ్ల స్పెషల్ సాంగ్..?
Rajitha Chanti
Pic credit - Instagram
విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.
తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శోభిత గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వినిపిస్తుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కించనున్న ఓ సూపర్ హిట్ సీక్వెల్లో శోభిత భాగం కానున్నట్లు సమాచారం. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ డాన్ 3.
హిందీలో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాన్. దీనికి సీక్వెల్గా వచ్చిన డాన్ 2 మూవీ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా త్వరలోనే డాన్ 3 కూడా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు.
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాలో శోభిత స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్.
ప్రస్తుతం చిత్రయూనిట్ శోభిత ధూళిపాళ్లను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శోభితతో డైరెక్టర్ ఫర్హాన్ చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ నడుస్తుంది.
శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. 2016లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్, బాలీవుడ్లో ఆఫర్స్ అందుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.