శోభిత ధూళిపాల స్టన్నింగ్ లుక్స్ వైరల్
Phani CH
22 AUG 2024
తెలుగు పిల్ల తెనాలి పిల్ల శోభిత ధూళిపాల. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది.
ఈ తెలుగు అందం మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది.
ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది.
ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా శోభితా ధూళిపాలకు మాత్రం తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.
ఇక సౌత్ లో తెలుగు, తమిళ భాషల నుంచి వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు తక్కువేమి లేవు.
ఈ ఏడాదిలో ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ మూవీలో ఆమె నటించారు. ‘కల్కి’లో దీపికా పదుకొణెకు తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చారు శోభిత.
మరోవైపు, నటుడు నాగచైతన్యతో ఆమె నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి