అందం ఈమెతో జతకట్టి పక్కనే ఉందేమో..

21 December 2023

TV9 Telugu

31 మే 1992న ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ శోభితా ధూళిపాళ.

ఆమె తండ్రి వేణుగోపాలరావు, మర్చంట్ నేవీ ఇంజనీర్ మరియు ఆమె తల్లి శాంతా కామాక్షి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు.

పుట్టింది తెనాలి అయినప్పట్టికి విశాఖపట్నంలో పెరిగింది. అక్కడే తన పాఠశాల విద్యను కూడా పూర్తి చేసింది.

పదహారేళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం తన సొంత ఊరిని వదిలి ఒంటరిగా మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లింది.

ముంబై విశ్వవిద్యాలయంలో H.R. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పట్టా పొందింది.

చదువుతున్న రోజుల్లో భరతనాట్యం మరియు కూచిపూడిలో శిక్షణ పొందింది. వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా గెలిచింది.

2013లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ అందాల పోటీల్లో విజయం సాధించి కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ అందాల తార.

50వ ఫెమినా మిస్ ఇండియాలో టాప్ 23లో ఆటో-ఎంట్రీని పొందింది మరియు మొదటి రన్నరప్‌గా నిలిచింది ఈ వయ్యారి భామ.