TV9 Telugu

06 March 2024

అమ్మ అవ్వాలి అనుకుంటున్న అంటున్న శోభితా ధూళిపాళ్ల.

శోభితా ధూళిపాళ్ల..  హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఏకైక తెలుగమ్మాయి. ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమా చేస్తుంది.

అడివి శేష్ నటించిచన గూఢచారి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

తాజాగా తన పర్సనల్ విషయాలను పంచుకుంది ఈ అమ్మడు. జీవితంలో తనకున్న ఒక కోరికను బయటపెట్టింది హీరోయిన్ శోభితా.

శోభితా మాట్లాడుతూ.. “జీవితంలో నేను ఏం కోరుకుంటున్నానంటే.. మాతృత్వం. ఎప్పుడూ ఆ ఫీలింగ్ అనుభవిస్తానో తెలియదు..

కానీ ఆమ్మ ఫీలింగ్ అద్భుతంగా భావిస్తాను. అమ్మ అవ్వడం.. అమ్మ అని పిలిపించుకోవడం చాలా బాగుంటుంది అంటూ..

అమ్మ అవ్వడం కోసమే ఎదురుచూస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.. శోభితా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

గతంలో శోభితా, నాగ చైతన్య ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరి ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

అయితే తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన శోభితా నిజం తెలియకుండ మాట్లాడే వ్యక్తులకు తాను సమాధానమివ్వాల్సిన పనిలేదని తెలిపింది.