పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో తొందర్లో మన ముందుకు రానున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ సీనియర్ స్టార్ హీరోకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే.. నో చెప్పారట.
ఇక అసలు విషయం ఏంటంటే! పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో పవన్ కు తండ్రిగా రఘువరన్ బదులు స్టారో శోభన్ బాబు నటించాల్సిందట.
నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా శోభన్ బాబునే అనుకున్నారట మేకర్స్. అయితే అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. ససేమిరా అన్నారట.
సుస్వాగతం సినిమా టైంకు శోభన్ బాబు కేరీర్ డౌన్ అయ్యింది. అయినా కానీ తాను హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని సుస్వాగతం మేకర్స్‌తో అన్నారట.
తనతోటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారుతున్నా.. తాను మాత్రం హీరోగానే సినిమాలు చేస్తానని గట్టిగా చెప్పారట.
అలా కాదంటే రిటైర్ అయిపోతా అన్నారట. దీంతో ఆ సినిమాలో పవన్ తండ్రి పాత్రకు రఘువరన్ ఎంపిక చేశారట ఈ మూవీ మేకర్స్.