ఆ అందం అమరత్వం పొంది ఈమెలో ఐక్యమైందేమో.. వయసు పెరిగిన తరగలేదు..
TV9 Telugu
28 January 2024
12 అక్టోబర్ 1981న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ తెలుగు కుటుంబం జన్మించింది అందాల తార స్నేహ.
ముంబైలో పుట్టినప్పటికి తల్లిదండ్రులతో దుబాయ్ లో పెరిగింది ఈ ముద్దుగుమ్మ. ఈమె అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు.
ఈ అందాల భామ తండ్రి పేరు రాజారాం నాయుడు, అయన వ్యాపారవేత్త మరియు తల్లి పేరు పద్మావతి రాజారాం, ఆమె గృహిణి.
2001లో తరుణ్ సరసన ప్రియమైన నీకు చిత్రంతో కథానాయకిగా టాలీవుడ్ చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ అందాల తార.
తర్వాత ఎన్నో చిత్రాల్లో హీరోలకి జోడిగా ప్రధానపాత్రలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అందాల భామ.
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే 11 మే 2012లో తమిళ నటుడు ప్రసన్న వెంకటేశన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ఈ వయ్యారి భామ.
భర్తతో కలిసి కొన్ని యాడ్స్ కూడా చేసింది. వీరిద్దరి ప్రేమకి చిహ్నంగా కొడుకు విహాన్, కూతురు ఆద్యంతలకు జన్మనిచ్చింది.
2019లో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన వినయ విధేయ రామలో చెర్రీకి వదినగా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి