ఈ బ్రహ్మ ఈమెకు అమృతంతో ప్రాణం పోసాడేమో.. వయసు పెరిగిన తరగని అందం..

18 November 2023

12 అక్టోబర్ 1981న మహారాష్ట్రలో ముంబైలో జన్మించింది అందాల తార స్నేహ. ఈమె అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు.

2000లో ఇంగనే ఓరు నీలపక్షి అనే ఓ మలయాళీ రొమాంటిక్ చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

తర్వాత ఆర్. మాధవన్ సరసన ఎన్నవలె అనే ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ భామ.

2001లో తరుణ్ కి జోడిగా ప్రియమైనా నీకు అనే ప్రేమ కథ చిత్రంలో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ వయ్యారి.

తర్వాత గోపీచంద్ కి జోడిగా తొలి వలపు చిత్రంలో నటించిన మెప్పించింది ఈ అందాల భామ. ఇది గోపీచంద్ తొలి చిత్రం.

జగపతి బాబు, అర్జున్ మల్టీస్టారర్ చిత్రం హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

తరువాత వెంకీ, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీ రామదాసు, పాండురంగడు, రాజన్న వంటి హిట్ చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది.

11 మే 2012న తమిళ నటుడు ప్రసన్నను చెన్నైలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది.