తాజాగా మరో సినిమా బ్లాక్ బస్టర్ లిస్టులో జాయిన్ అయింది. అసలు 2023లో సర్‌ప్రైజ్ చేసిన స్మాల్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.
కొన్ని సినిమాలు హీరోల కోసం.. మరికొన్ని దర్శకుల కోసం చూసే ఆడియన్స్ ఉంటారు. కానీ చిన్న సినిమాలు మాత్రం కేవలం కంటెంట్ కోసమే చూడాలి.
అందులో కథ బలంగా ఉన్నపుడే కాసులొస్తాయి.. లేదంటే కథ కంచికే. అలాంటి చిన్న సినిమాలే 2023లో మ్యాజిక్ చేస్తున్నాయి.
తాజాగా మ్యాడ్ మూవీ కూడా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ వారం సినిమాల్లో సైలెంట్ సెన్సేషన్ ఇది. పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో మ్యాడ్ సినిమాను తెరకెక్కించారు కళ్యాణ్ శంకర్
ఇదిలా ఉంటే మొన్నామధ్య బేబీ కూడా అలాంటి సంచలనమే క్రియేట్ చేసింది. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన బేబీ ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.