ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల రచ్చ రంబోలా.. తగ్గదేలే అంటున్న కుర్ర హీరోలు.. 

29 August 2025

Prudvi Battula 

విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన ‘కింగ్‎డామ్’ ఆగస్టు 27 నుంచి నెట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

‘ది 100’ అనే ఓ పోలీస్‌ డ్రామా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ వేదికగా ఆగస్టు 29 నుంచి అందుబాటులో ఉంది.

శ్రీసింహా హీరోగా తెరకెక్కిన సినిమా ‘భాగ్‌ సాలే’. రెండేళ్ల కిందట విడుదలైన ఈ మూవీ ఈటీవీ విన్‌ వేదికగా ఆగస్టు 27 నుంచి అలరిస్తుంది.

తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘రాంబో ఇన్‌ లవ్‌’ ఆగస్టు 29 నుంచి జియో హాట్‌స్టార్‌లో డిజిటల్ వేదికగా సందడి చేస్తుంది.

ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా తెరకెక్కిన సిరీస్ ‘లెక్కల మాస్టర్‌’ ఆగస్టు 31న నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీనివాస్ అవసరాల ప్రధానపాత్రలో నటిస్తున్నారు.

‘ది డోర్‌’ అనే తమిళ మూవీ ఆహా వేదికగా ఆగస్టు 29 నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉండవచ్చు.

అనురాగ్ బసు దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్, అలీ ఫజల్, నీనా గుప్తా నటించిన హిందీ సినిమా ‘మెట్రో ఇన్ డినో’ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 29 నుంచి ప్రసారం అవుతుంది.

నామ్‌ కూంగ్‌ సన్‌ దర్శకత్వం వహించిన ఈ కొరియన్‌ డ్రామా ‘లవ్‌ అన్‌టాంగిల్డ్‌’. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 29 నుంచి ప్రేక్షకులను అలరిస్తుంది.