ఉస్తాద్ తరఫున ఫ్యాన్స్ కి ఇదో చిన్న కానుక..
TV9 Telugu
19 March 2024
సృజనాత్మకంగా చేసిన ఏ పనికైనా ఓ లక్ష్యం ఉంటుంది. అనుకుని మొదలుపెట్టిన లక్ష్యాన్ని చేరుకోగలిగినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది.
ఈ విషయాన్ని తన సినిమాల విషయంలో బాగా అర్థం చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.
అందుకే ఇంత బిజీలోనూ టైమ్ కల్పించుకుని హరీష్ శంకర్ తో చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్‌కి డబ్బింగ్ చెబుతున్నారు.
ప్రస్తుత ఎలక్షన్ టైమ్‌కి పవన్ కల్యాణ్‌కి కలిసొచ్చే కొన్ని డైలాగులు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో ఉన్నాయట.
అవి ఎన్నికల టైమ్‌లో రిలీజ్ కావడమే కరెక్ట్ అని భావించారట ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్. ఇది మూవీకి ప్లస్ అవుతుంది.
ఈ విషయాన్నే జనసేనాని పవన్ కల్యాణ్‌కి డిటైల్ గా వివరించి చెప్పి ఒప్పించారట చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.
అలాంటి పవర్‌ఫుల్ డైలాగులతో వచ్చే సన్నివేశాలను కట్ చేస్తున్నారట మేకర్స్. ఎన్నికలు పూర్తయ్యాక షూటింగ్‌కి హాజరవుతారు పవన్‌కల్యాణ్.
అప్పటిదాకా ఉస్తాద్ భగత్‌సింగ్ తరఫున ఫ్యాన్స్ కి ఇదో చిన్న కానుక అన్నమాట. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి