26 September 2023
పైగా ఇందులో రామ్ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా యాసలో మాట్లాడుతున్నారు. ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది.. దాన్నే సస్పెన్స్‌గా దాచేసారు మేకర్స్.
రెండు రాష్ట్రాల సీఎంలు తమ కుటుంబానికి చేసిన అన్యాయంపై హీరో ఎలా పగ తీర్చుకున్నారు.. వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పారు.. సిస్టమ్‌లోని లోపాలు ఎలా చూపించారనే లైన్‌తో స్కందను తెరకెక్కించారు బోయపాటి శ్రీను.
సినిమా మాస్‌గా కనిపిస్తున్నా.. కంటెంట్ మాత్రం పొలిటికల్‌గా హీట్ పెంచేలా ఉంటుందని తెలుస్తుంది. శ్రీలీల, సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బాలయ్యతో పొలిటికల్ పంచులు ఎక్కువగా వేయిస్తుంటారు బోయపాటి. కానీ ఫస్ట్ టైమ్ రామ్ లాంటి యంగ్ హీరోతోనూ పొలిటికల్ పవర్ చూపించబోతున్నారు ఈ మాస్ డైరెక్టర్.